Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope in telugu: ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 28 ఆదివారం నుంచి ఫిబ్రవరి 3 శనివారం వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చెయ్యి జారిపోయే అవకాశం కలదు. ప్రతి విషయంలోనూ భయపడకుండా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి. Software ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు.తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. Fast food items వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన గృహ నిర్మాణ అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్నవారు వాక్కు చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోకలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. జూదం జోలికి వెళ్లకూడదు. దుర్గాదేవి ఆరాధన చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు మర్చిపోకూడదు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు మంచి కాలము. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండను. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. అసంతృప్తి భోజనం ఉంటుంది. Pharmactical వ్యాపారస్తులకు నష్టములు కలిగే అవకాశం కలదు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తొందరగా అలసిపోతారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తొందరగా అలసిపోతారు. మానసిక ఆందోళన ధైర్యంగా అధిగమించాలి. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. రవాణా శాఖ ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. oil వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. తలనొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రికి వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలాన్ని గడుపుతారు. నూతన గృహం కోసం ధన వ్యయము చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చేసినప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృశ్చిక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో వైద్య వృత్తిలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. మిఠాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వము అంత మంచిది కాదు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటవుతుంది. ఆత్మీయుల ఎడబాటు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకుంటారు. సోదరులతో సఖ్యత బలపడుతుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ వారంలో మతిమరుపు వలన సమస్యలు ఏర్పడతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు వాయిదా పడతాయి. ఆహార సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. బంగారం కొనుగోలు చేస్తారు. జమానతు సంతకాల వల్ల ఇబ్బంది పడతారు. సంతాన ప్రయత్నాలు చేసే వారు వైద్యులను సంప్రదిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. పైత్య సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. Rice Mill వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిద్ర సరిగా పట్టకపోవడం ఒక సమస్యగా మారుతుంది. కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దైవ స్మరణ మీద ఎక్కువ సమయాన్ని గడుపుతారు. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

Weekly Horoscope Virgo కన్య రాశి వారికి ఈ వారంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. వ్యాపార విషయంలో స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. Textile వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. అకారణ కలహములకు దిగడం వల్ల నష్టపోయే అవకాశం కలదు. ముఖ్యమైన పనుల యందు అదృష్టం తోడవుతుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన legal issues వాయిదా పడతాయి. విద్యార్థుల శ్రమ చేయవలసిన సమయం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

తులా రాశి

తుల రాశి వారికి ఈ వారంలో మధ్యవర్తిత్వము వలన లాభపడతారు. వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. Chit Fund వ్యాపారస్తులకి వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టముల కలిగే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు శ్రమించడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. ధనపరమైన ఎదుగుదల ఉంటుంది. పోలీసు శాఖ వారికి వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. పాత బాకీలు వసూలవుతాయి. వ్యసనాలకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు కలవు. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు.ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శత్రువులను కూడా మంచి మనసుతో క్షమిస్తారు. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాలుపంచుకుంటారు. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. బంగారం వ్యాపారస్తులు మీ తెలివితేటలతో అధిక లాభాలను పొందగలుగుతారు. ప్రభుత్వ పరిపాలన ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవాలి. సంగీతము పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. అప్పు కొంత తీర్చగలుగుతారు. Skin Infection తో బాధపడతారు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. తల్లి తరపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారంలో నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలము. ఓపిక సహనము లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరమైన సమస్యలు ఉండను. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఇతరుల విషయాలలో తల తూర్చడం వల్ల అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. వ్యాపార విస్తరణకై ధన వ్యయము చేయవలసి వస్తుంది. వ్యర్థ కలహాలకు దూరంగా ఉండాలి. వేళ తప్పిన భోజనం ఉంటుంది. ధనపరమైన ఇబ్బందులకు పరిష్కారాన్ని ఆలోచించాలి. Construction flied ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. మీ మాటల వల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశాలు కలవు. తండ్రి నిర్ణయాలతో వ్యతిరేకిస్తారు. అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ వారంలో పాత బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తండ్రితో చర్చించి తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు. సౌకర్యవంతంగా కాలాన్ని గడపాలని అనే ఒక ఆలోచన విధానం ఉంటుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. Iron & Cement వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాల విషయంలో ఇబ్బందులు ఉండును. అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వారికి యోగ కాలము. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  July Rashi Phalalu | జూలై మొదటి వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఫలితాలు.!

కుంభ రాశి

Weekly Horoscope  ఈ రాశి వారికి ఈ వారంలో మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సూత్రాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. పోలీస్ శాఖ వారికి పని భారము అధికంగా ఉంటుంది. దాంపత్య పరమైన మనస్పర్థలు తొలుగుతాయి. శుభకార్యం నిర్వహించే అవకాశాలు కలవు. Chit fund & Finance వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సభా గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు మంచి కాలము. మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. తండ్రి కొరకు ధన వ్యయం చేస్తారు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారంలో ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. శత్రువులను కూడా మంచి మనసుతో చేరదీస్తారు. బ్యాంకులో పని చేసే వారికి పని భారం అధికంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కొత్తగా వివాహమైన దంపతులు కలహాలకు దూరంగా ఉండాలి. Plastic & Rubber వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. తొందరగా అలసిపోతారు. బంధు మిత్రులతో కలిసి సరదాగా కాలాన్ని గడుపుతారు. అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. అప్పు కొంత తీర్చగలుగుతారు. వారం చివరలో తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *