తెలంగాణకు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎంట్రీ
- మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
- అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ నిర్ణయం
- తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు
- ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు దన్ను
WB discovery development centre : మీడియా, వినోద రంగంలోని ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WB Discovery) తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతోంది. హెచ్ బిఓ (HBO), హెచ్బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టిఎల్ సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే.. గేమింగ్, స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. ఈ మేరకు తమ విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ (Minister KTR)తో చర్చించింది.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రంతో 1,200 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్నర్ బ్రదర్స్ సంస్థ టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఆర్థిక విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్ బుధవారం న్యూయార్క్‌లో సమావేశమయ్యారు.
1,200 మందికి ఉపాధి
మీడియా, వినోద రంగంలో హైదరాబాద్‌లో అందుబాటులోనున్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు కార్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో WB discovery development centre (ఐడీసీ)ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కేంద్రం భారత్‌లోని తమ సంస్థ కార్యకలాపాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ఐడీసీలో మొదటి ఏడాదే సంస్థ 1,200 మంది నిపుణులను నియమించుకోనుంది. వ్యాపారాభివృద్ధిని బట్టి భవిష్యత్తులో మరింత మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది.
వార్నర్ బ్రోస్ డిస్కవరీకి హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్, సీఎన్‌ఎన్, టీసీఎల్, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినీమాక్స్, పోగో, టూన్‌కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ తదితర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విభిన్న టెలివిజన్ చానళ్లు ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థ తన కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి