BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి
Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని ఫలితాలు వచ్చాయి. పార్టీకి ప్రధాన బలంగా భావించిన అగ్రనేతలు ఓటమి పాలు కావడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారు మాత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 8 స్థానాలు ప్రజలకు కట్టబెట్టిన కీలకమైన అగ్రనేతలను నేతలు ఓడిపోవడం మాత్రం మింగుడుపడని అంశంగా మారింది.
బండి సంజయ్ ఓటమి పెద్ద షాక్..
తెలంగాణ మొత్తం బీజేపీకి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి నేతగా బండి సంజయ్‌కి పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా పార్టీని అగ్రపథాన నిలబెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. తెలంగాణలో బలమైన బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన్ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం.. గందరగోళం నెలకొంది. మొదట్లో సీఎంగా బీసీ నేతలను నియమిస్తామన్న బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఆ సమయంలో బండిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అలాంటి కీలక నేత ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం పార్టీకి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు.
బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓటమిచెందారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని ఆయన భావించారు. కానీ అది కాలిరాలేదు.
రఘునందన్‌రావుకు తప్పని ఓటమి
2020 ఉపఎన్నికల వరకు రఘునందన్ రావు ఎక్కువ మందికి తెలియదు. కానీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉపఎన్నికలు జరగగా బీజేపీ నుంచి రఘనందన్‌రావు బరిలో దిగారు. బీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పై రఘునందన్‌రావు 1079 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఆమె అధికార పార్టీకి పెద్ద దెబ్బగా భావించారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్‌రావు ఓడిపోవడం బీజేపీకి పెద్ద షాక్ గా భావించవచ్చు.
అర్వింద్‌కు ఝలక్..
నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కమలం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. తెలంగాణ బీజేపీలో అత్యంత కీలక నేత. పాలక ప్రభుత్వాలపై మీడియాలో ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. అయితే ఈసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అర్వింద్. కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రచార సమయంలో కూడా కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్రంగా విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తి ఓటమి కూడా కమలం పార్టీకి ఎదురు దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈటల రాజేందర్‌కు కోలుకోలేని దెబ్బ
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఓటమి బీజేపీకి అతి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేతగా ఉంటూ బీఆర్‌ఎస్‌లో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల పలు కారణాలతో పార్టీ మారడం అప్పట్లో సంచలనంగా మారింది. కేసీఆర్ ఆయన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయగా, పార్టీ మారారు. బీజేపీలో చేరిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ లో 2021 లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేయగా.. అయనకుప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను బరిలో దింపింది. దళిత బంధు వంటి పథకాన్ని అక్కడ ప్రవేశ పెట్టి మంత్రులు, బీఆర్‌ఎస్ అగ్ర నేతలంతా అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అష్టదిగ్బంధం చేసినా కూడా ఈటల భారీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
హుజురాబాద్ గెలుపుతో కీర్తిపెంచుకున్న ఈటల రాజేందర్.. 2023 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ తోపాటు గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ చేశారు. ఇక్కడ ఆయనపై మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ల్ కూడా రాలేదు. తర్వాత బీఆర్‌ఎస్‌లో ఆయన ఎమ్మెల్సీగా అయ్యారు. ఇప్పుడు ఈటల రాజేందర్ పై పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు.
అయితే ప్రచారం సందర్భంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంమయ్యాయి. తాను ఈసారి విజయం సాధించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందరిముందు వ్యాఖ్యానించారు.. మూడో తేదీ తర్వాత గెలిస్తే విజయయాత్రలో పాల్గొంటానని… లేకుంటే తన శవయాత్రకు అందరూ రావాలంటూ ఎమోషనల్‌గా ప్రచారం చేశారు. ఈ వ్యాఖ్యలే కౌశిక్ రెడ్డి విజయానికి.. ఈటలకు ఓటమికి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బూస్టింగ్ ఇచ్చిన కామారెడ్డి
కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ని చ్చింది. కమలం పార్టీ అభ్యర్థి.. వెంకట రమణారెడ్డి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 5,156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్ గా కామారెడ్డి నిలిచింది. ప్రధాన పార్టీల అగ్ర నేతలు పోటీ చేయడంతో మొదటి నుంచి ఈ స్థానంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఓటర్లు మాత్రం స్థానిక నేత అయిన వెంకట రమణారెడ్డిని దీవించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..