Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..
Vizag Vande Bharat Express | హైదరాబాద్ : విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులో స్వల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది.
దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవలందించేవి.
విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ.సి చైర్ కార్ కోచ్‌లు కలిగి 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో సేవలను అందిస్తోంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..