
Visakha Metro Rail | ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అప్ డేట్.. వచ్చింది. మెట్రో లైన్ నిర్మాణానికి సంబంధించిన మొదటి దశ డీపీఆర్‌లను చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొదటి విడతో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది.
- మొదటి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ)
- రెండో కారిడార్ : గురుద్వార్ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్ వరకు (5.08కి.మీ)
- మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ)
కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖర్చవుతుందని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 కిలో మీటర్ల మేర నాలుగవ కారిడార్‌గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజయవాడ మెట్రో రైల్
Vijayawada Metro Rail : ఇదిలా ఉండగా విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.దీనిని కూడా రెండు దశల్లో (కారిడార్ 1ఎ, 1బిగా) మొత్తం 38.4కి.మీ మేర నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా కారిడార్ 1ఎ, బి నిర్మాణానికి రూ.11,009 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. భూసేకరణ కోసం రూ.1152 కోట్ల వ్యయంతో డీపీఆర్‌ను రూపొందించారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్‌ను 27.75కి.మీల మేర నిర్మించాలని నిర్ణయించింది.
- 1ఎ కారిడార్‌లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ వరకు;
- 1బిలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు
రెండో కారిడార్ : పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు
మూడో కారిడార్‌ను మరలా రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..