
Vandebharat Sleeper Trains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయ రైల్వే (Indian Railways) శుభవార్త తెలిపింది. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. మొదటి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూదిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు నడవనున్నాయి. సికింద్రాబాద్-దిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పరుగులుపెడుతున్నవందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో చాలా వరకు పూర్తి ఆక్సుపెన్సీతో నడుస్తున్నాయి. అందుకే ఇండియన్ రైల్వే వందేభారత్ స్లీపర్ రైళ్ల (Vandebharat Sleeper trains)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ప్రాధాన్యమిస్తోంది. తొలి విడతలోనే రెండు స్లీపర్ రైళ్లు కేటాయించారు. ఈ రెండు రైళ్లు ఏ రూట్‌లో ఉంటాయి, టికెట్ ధర ఎంత ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకోండి..
సికింద్రాబాద్ టూ ఢిల్లీ రూట్ ఇదే..
సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందే భారత్ రైలు రూట్ ఖరారు అయింది. ఈ వందేభారత్ స్లీపర్ రైలు.. ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగపూర్, బల్హార్షా, కాజిపేట్ జంక్షన్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది.
ఇక ఈ వందేభారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి ధరల విషయానికొస్తే థర్డ్ ఏసీ కోచ్ ఛార్జీ రూ.3600, సెకండ్ ఏసీ కోచ్ ఛార్జీ రూ.4800, ఫస్ట్ ఏసీ కోచ్ ఛార్జీ దాదాపు రూ.6000 ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి రాత్రి 08:50 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు.. మరుసటి రోజ రాత్రి 08:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేలా ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇది పట్టాలెక్కితే ఒక్క రోజులోనే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.