Vande Cargo News | భారతీయ రైల్వే వందే భారత్ రైలు ద్వారా ఎంతో మందికి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. వందే భారత్ రైళ్ల సక్సెస్ తో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వెర్షన్, వందే మెట్రో రైళ్లు కూడా వస్తున్నాయి. అయితే త్వరలో సరుకుల రవాణా కోసం వందే కార్గో కూడా త్వరలో పట్టాలపై పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైలు అధిక వేగంతో నడుస్తుంది. దీని రూపురేఖలు వందే భారత్ రైలును పోలి ఉంటాయి. దాని గురించిన పూర్తి వివరాలు ఇవే..
ఈ వందే కార్గో రైలు చూడడానికి సరిగ్గా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే ఉంటుంది. ఈ వందే కార్గో రైలులో ప్రయాణికులకు సీట్లు ఉండవు. మీడియా నివేదికల ప్రకారం, వందే కార్గో రైలు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా సిద్ధమవుతుంది. రైల్వే తన సేవలను మరింత మెరుగ్గా, ఆధునికంగా మార్చడంపై దృష్టి సారిస్తోంది. ఈ వందే కార్గో రైలు ద్వారా తక్కువ సమయంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులభంగా, సురక్షితంగా సరుకుల రవాణా చేస్తుంది. ప్రస్తుతం ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో వందే కార్గో రైలు తయారీ పనులు జరుగుతున్నాయి.
వందే భారత్ కార్గో
చెన్నైలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో వందే కార్గో రైలు (Vande Cargo Rail) ను తయారు చేస్తున్నారు. వందే భారత్, వందే మెట్రో రైళ్ల కోచ్‌లు నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌ను హైస్పీడ్ వందే కార్గో కోసం ఉపయోగిస్తారు. రైల్వే శాఖ ప్రకారం, తక్కువ దూర నగరాల మధ్య వందే కార్గో రైలును నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలోనే 6 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ నుంచి పాట్నా, భాగల్పూర్, దుమ్కా నుంచి హౌరా, బ్రహ్మపూర్ నుంచి టాటానగర్, గయా నుంచి హౌరా, డియోఘర్ నుంచి వారణాసి, రూర్కెలా నుంచి హౌరా వరకు నడుస్తాయి. ఇది కాకుండా, పీఎం మోడీ ఇటీవల అహ్మదాబాద్‌లో 8,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
– #VandeBharatExpress के #Cargo वर्जन का पहला लुक
– वंदे भारत की तर्ज पर माल ढुलाई के लिए जल्द सेमी हाई स्पीड ट्रेन #Vandebharat कार्गो
– #ICF में वंदे भारत के प्लेटफार्म बेस पर निर्माण जारी, दिसंबर तक आएगी पहली वंदे भारत कार्गो #Freight #Railways #HighSpeed @ZeeBusiness pic.twitter.com/3EO6lpBXgw— Ambarish Pandey (@pandeyambarish) September 22, 2024
అహ్మదాబాద్-గాంధీనగర్ రెండో దశ మెట్రో రైలు సర్వీసును కూడా ప్రధాని మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. త్వరలో వందే భారత్ స్లీపర్ కూడా ప్రారంభం కానుంది. దేశంలో వందేభారత్ స్లీపర్ రైలును కూడా నడపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, వందే భారత్ స్లీపర్ రైలులో మునుపటి కంటే సౌకర్యవంతమైన బెర్త్‌లు, శుభ్రమైన, ఆధునిక టాయిలెట్లు, హై స్పీడ్ వై-ఫై, ప్రతి సీటుపై ప్రయాణీకులకు ప్రత్యేక రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ ఆవిష్కరణ సందర్భంగా, ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపగలదని చెప్పారు. ఐదేళ్ల క్రితం ముంబై-ఢిల్లీ మధ్య గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లను నడపడానికి ‘మిషన్ రాఫ్తార్’ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. రైళ్ల వేగం, భద్రతను పెంచడానికి, భారతీయ రైల్వే ‘కవాచ్’ సాంకేతికతను అన్ని మార్గాల్లో మోహరిస్తున్నారు. కవచ్ అమర్చబడిన రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడం అసాధ్యం, ఎందుకంటే ఢీకొనడానికి ముందు ఆటోమేటిక్ బ్రేక్‌లు అప్లయ్ అవుతాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేలో రైళ్ల సగటు వేగం గంటకు 70 నుంచి 80 కి.మీలు ఉండగా, దీనిని గంటకు 160 కి.మీలకు పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..