Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాతన సౌకర్యాలతో రాత్రిపూట వేగంగా తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చు. వందేభారత్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు
వందే భారత్ స్లీపర్ రైలు మొదట న్యూఢిల్లీ మధ్య శ్రీనగర్ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మరికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై మార్గాల్లోనూ వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు భావిస్తున్నారు.
వందే భారత్ స్లీపర్ రైలు: ఫీచర్లు
Vande Bharat sleeper train Expected features : కొత్త రైలు బ్రేకింగ్ సమయంలో రీజనరేటివ్ బ్రేకింగ్ రీసైకిల్ ఎనర్జీతో వస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. రైలు కార్బన్ పాదముద్రను తగ్గిస్తుంది. ఈ రైలు తక్కు శబ్దంతో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కోసం అండర్-స్లంగ్ ప్రొపల్షన్‌ను కలిగి ఉంటుంది. వేగం, దూరం, ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షించే వ్యవస్థను ఇందులో పొందుపరిచారు.
వందే భారత్ స్లీపర్ రైలు: సీటింగ్ అమరిక
కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో మూడు తరగతులు ఉంటాయి:
- AC ఫస్ట్ క్లాస్,
- AC 2-టైర్
- AC 3-టైర్.
ఒక్కో రైలుకు 16 క్యారేజీలతో, కోచ్‌లు 11 AC 3-టైర్, నాలుగు AC 2-టైర్, ఒక ఫస్ట్-క్లాస్ కోచ్‌తో సహా మొత్తం 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
వందే భారత్ స్లీపర్ రైలు: టిక్కెట్ ధర
Vande Bharat sleeper Train Ticket Prices : అధికారిక టిక్కెట్ ధరలను భారతీయ రైల్వే ఇంకా ప్రకటించలేదు. ఛార్జీలు రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ప్రీమియం రైళ్లతో సమానంగా అంచనా వేస్తున్నారు.
- AC 3-టైర్: సుమారు రూ. 2,000.
- AC 2-టైర్: దాదాపు రూ. 2,500.
- AC ఫస్ట్ క్లాస్: సుమారు రూ. 3,000.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు