vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..
vande bharat sleeper train : భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొస్తోంది. ఈ రైలు కొత్త డిజైన్‌తో తయారీకి సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొత్త డిజైన్‌ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తాయి. కాగా కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అవి రాత్రిపూట ఈ హై-స్పీడ్ రైళ్లు ఎక్కువ దూరం ఉన్న గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి అనువుగా ఉంటాయి. అత్యాధునిక హైటెక్ ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్ తో స్వదేశీ సెమీ-లైట్ స్పీడ్ రైలు ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. అధిక వేగం, మెరుగైన భద్రత, మంచి సర్వీస్ కారణంగా వందేభారత్ రైళ్లు అధిక ఆక్యపెన్సీతో రన్ అవుతున్నాయి.
ప్రపంచ స్థాయి ఫీచర్లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. న్యూఢిల్లీ, వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 15, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారైన ఈ రైలు సెట్ ‘మేక్-‘కి చిహ్నంగా నిలుస్తుంది. భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు సెట్‌లను తయారు చేసే ప్రాజెక్ట్ 2017 మధ్యలో ప్రారంభమైంది. 18 నెలల్లోనే, ICF చెన్నై ఫ్యాక్టరీలో ట్రైన్-18ని పూర్తి చేసింది. జనవరి 2019లో వచ్చిన మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరుపెట్టారు. ఈ రైలు కోట-సవాయి మాధోపూర్ సెక్షన్‌లో గరిష్టంగా 180 kmph వేగాన్ని అందుకుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం Google News, తోపాటు X (ట్విట్టర్), WhatsApp లోనూ సంప్రదించవచ్చు.