వచ్చే నెల నుంచే వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే

వచ్చే నెల నుంచే వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే

Vande Bharat Sleeper | భారతీయ రైల్వే..  2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  వందే భారత్‌ రైళ్లు సక్సెస్ ఫుల్ గా వంద శాతం ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. అదే ఉత్సాహంతో రైల్వేశాఖ అత్యాధునిక సౌకర్యాతో వందేభారత్ స్లీపర్‌ కోచ్ రైలును తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది.  ఈ రైలును వచ్చే నెలలో  ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమైంది.  2024 మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి.

వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతమైన తర్వాత  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది, వందేభారత్ స్లీపర్‌ రైలు ఇతర  హైస్పీడ్‌ రైళ్లకంటే మెరుగైన ఫీచర్లు, వేగం కలిగి ఉంటుంది.  సుదూర నగరాలను మధ్య ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.  ప్రస్తుతం ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని అధిగమించే లక్ష్యంతో, ప్రయాణ సమయాన్ని గణనీయంా తగ్గించేందుకు వందేభారత్  స్లీపర్‌ రైళ్లను నడపాలని  నిర్ణయించినట్లు  రైల్వే వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో 10 రైళ్లను ప్రారంభిస్తారని, ఇందులో ఢిల్లీ – ముంబయి, ఢిల్లీ – హౌరాతో సహా పలు ప్రధాన మార్గాల్లో మార్చి- ఏప్రిల్‌లో స్లీపర్‌ వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

READ MORE  Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో దాదాపు 16 నుంచి 20  కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.  చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైళ్లు పూర్తిగా సిద్ధమై  ఉన్నాయని వివరించారు. అయితే ప్రస్తుతం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చైర్‌కార్‌ మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. మరో వైపు రైల్వేశాఖ వందేభారత్‌ మెట్రో రైలు ను కూడా ప్రవేశపెట్టనుంది. వీటిని సైతం ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించినా.. ఎప్పటికి వస్తాయనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ఇండియన్ రైల్వేస్ చెప్పుకోదగ్గ  అభివృద్ధి సాధించింది. కొత్తగా 26,000 కిలోమీటర్ల మేర ట్రాక్‌ వేసి నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. భారతీయ రైల్వేలు రాబోయే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో అదనంగా 40,000 కిలోమీటర్ల ట్రాక్‌లను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

READ MORE  Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *