11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది.
తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు
- హైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) (Vijayawada-Chennai ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- ఉదయపూర్-జైపూర్ (Udaipur-Jaipur ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరునెల్వేలి-మధురై-చెన్నై(Tirunelveli-Madurai-Chennai )వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పాట్నా-హౌరా (Patna-Howrah ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- కాసరగోడ్-తిరువనంతపురం (Kasaragod-Thiruvananthapuram ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- రూర్కెలా- భువనేశ్వర్-పూరీ (Rourkela- Bhubaneswar-Puri) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- రాంచీ-హౌరా (Ranchi-Howrah) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- జామ్‌నగర్-అహ్మదాబాద్ (Jamnagar-Ahmedabad ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. తక్కువ సమయంలోనే వారి గమ్యస్థానాలకు చేరవచ్చు. రూర్కెలా-భువనేశ్వర్ – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అలాగే, కాసరగోడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే సుమారు 3 గంటలు వేగంగా గమ్యాన్ని చేరుకుంటాయి. ఇక హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే 2.5 గంటలు ముందుగానే చేరుకుంటుంది. తిరునెల్వేలి-మధురై-చెన్నై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2 గంటల కంటే ఎక్కువ సమయం ఆదా చేస్తుంది. రాంచీ – హౌరా, పాట్నా – హౌరా, జామ్‌నగర్-అహ్మదాబాద్‌లలో, ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 1 గంట సమయం ఆదా చేస్తుంది.
PMO ఒక అధికారిక ప్రకటనలో, “దేశవ్యాప్తంగా ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలకు కనెక్టివిటీని మెరుగుపరచాలనే ప్రధానమంత్రి సూచన మేరకు రూర్కెలా-భువనేశ్వర్ – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. పూరి, మధురై పట్టణాలు. అలాగే, విజయవాడ – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మార్గంలో నడుస్తుంది. ఈ రైలు తిరుపతి తీర్థయాత్ర కేంద్రానికి కనెక్టివిటీని అందిస్తుంది.”
“ఈ వందే భారత్ రైళ్ల రాక Vande Bharat Express trains తో దేశంలో అత్యాధునిక రైలు సేవలకు నాంది పలుకుతుంది. కవాచ్ టెక్నాలజీతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన ఈ రైళ్లు ఆధునిక, వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ”అని పేర్కొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.
wooow