Wednesday, April 16Welcome to Vandebhaarath

Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..

Spread the love

Vande Bharat : దేశంలో అత్యంత పాపులర్ అయిన  వందే భారత్ రైళ్లు మరింత స్పీడ్ తో పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ట్రయిల్స్ నడుస్తున్నాయి. ముందుగా ముంబై – అహ్మదాబాద్ మార్గంలో టాప్ స్పీడ్ తో వందేభారత్ రైళ్లను నడిపించనున్నారు.

ప్రస్తుతం వందేభారత్ ప్రీమియం సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే  గంటకు గరిష్టంగా 160 కి.మీ (కి.మీ) వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆమోదం తెలిపింది. ట్రయల్ రన్ విజయవంతమైతే ప్రయాణికుల ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు తగ్గుతుంది.

READ MORE  ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

రైల్వే సేఫ్టీ కమిషన్..  ఇటీవల ముంబై సెంట్రల్‌లో వడోదర-అహ్మదాబాద్ మార్గంలో ఎగువ,  దిగువ రెండు దిశలలో 16 కోచ్ లు కలిగిన వందే భారత్ రైలు   కన్ఫర్మేటరీ ఓసిల్లోగ్రాఫ్ కార్ రన్ (COCR) నిర్వహించడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఈ ట్రయల్స్ పగటిపూట, అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే నిర్వహించాలని రైల్వే సేఫ్టీ కమిషన్.. వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌ కు సూచించింది.

పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు

Vande Bharat Express ట్రయల్ రన్ కు ముందు అన్ని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద అదనంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని నియమిస్తారు. పాదచారులను గేటు లోపలికి అనుమతించరు. ట్రయల్ రన్ సమయంలో విరిగిన లేదా  పడిపోయిన  బారికేడ్లను సరిచేస్తారు.   ట్రయల్ రన్ సమయంలో రైలు నడుస్తున్నపుడు స్టేషన్లలో ప్రయాణికులు పట్టాలు దాటకుండా చూస్తారు. ప్లాట్‌ఫారమ్ అంచు నుంచి తగినంత సురక్షితమైన దూరం నిర్వహించబడేలా ప్రజలను ముందుగానే హెచ్చరించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ట్రయల్ రన్‌కు ముందు, లోకో పైలట్‌లకు శిక్షణ ఇచ్చారు. అలాగే వారి మెడికల్ ఫిట్‌నెస్ ను కూడా తనికీ చేస్తారు. అదే సమయంలో లోకో పైలట్, కో-లోకో పైలట్ ట్రయల్స్ కోసం తీసుకుంటారు.

READ MORE  Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేష‌న్

Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *