Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేషన్ లో హాల్టింగ్
Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిలపాలని డిమాండ్ వస్తోదంఇ. ఈ క్రమంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేషన్ లో ఒక నిమిషం పాటు ఆగనుంది.
విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభారత్ రైలు… విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో హాల్టింగ్ సౌకర్యం కల్పించినందుకు ఇచ్చినందుకు ఎంపీ పుట్టా మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్యన నడిచే వందేభారత్ రైలుకు విజయవాడ- రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. గతంలో వందేభారత్ రైలు ఎక్కినప్పటికీ ఏలూరు (Eluru) లో స్టాపింగ్ లేకపోవటంతో దూరపు స్టేషన్‌లలో దిగాల్సి వచ్చేది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే.. ఏలూరులోనూ రైలును ఆపాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
తెలుగు రాష్ట్రాలలో నడిచే వందేభారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ రైళ్లలో 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంటోంది. ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం, కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి మార్గాల్లో వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..