UPI Payments | ఇకపై ఫింగర్ ప్రింట్ ఫేస్ రికగ్నేషన్ తో UPI చెల్లింపులు ?
UPI Payments | భారత్ లో అత్యధిక డిజిటల్ లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, UPI ద్వారా చేసిన చెల్లింపుల గణంకాలు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయినప్పటికీ, UPI చెల్లింపులను ఉపయోగించని వారు దేశంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), UPI చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేయాలని ప్లాన్ చేస్తోంది. UPI చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఇకపై పిన్ కోడ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వారు ఫేస్ రికగ్నేషన్ (Facial Recognition), లేదా ఫింగర్ ప్రింట్ ను ఉపయోగించవచ్చు.
బయోమెట్రిక్ సాయంతో.. UPI Payments
స్మార్ట్‌ఫోన్ బయోమెట్రిక్‌ల సాయంతో UPI చెల్లింపులకు సంబంధించి NPCI పలు కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఇటీవలి నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో, వినియోగదారులు ఏదైనా UPI పేమెంట్ కోసం పిన్ లేదా కోడ్‌ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల బయోమెట్రిక్ ఫీచర్‌లను ఉపయోగించి ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది.
PIN లేకుండా UPI చెల్లింపులు
ఉదాహరణకు, ఎవరికైనా UPI చెల్లింపు చేసేటప్పుడు, వినియోగదారులు UPI పిన్‌ను నమోదు చేయవలసిన అవసరం లేదు. అందుకు బదులుగా, వారు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్ బయోమెట్రిక్ లాక్‌ని ఉపయోగించవచ్చు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలను నివారించడానికి NPCI కొత్త టెక్నాలజీని అన్వేషిస్తోంది. ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు UPI చెల్లింపులు చేయడానికి PhonePe, Amazon Pay, PayTm వంటి యాప్‌లపై ఆధారపడుతున్నారు.
మిలియన్ల మంది UPI వినియోగదారులు 6-అంకెల PIN లేదా కోడ్‌ని గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. NPCI నుంచి అప్‌గ్రేడ్ వచ్చిన తర్వాత ఈ UPI సిస్టమ్‌తో, వినియోగదారులు వారి బొటనవేలు ముద్ర లేదా ఫేజ్ రికగ్నేషన్ ఉపయోగించి చెల్లింపులు చేయగలుగుతారు. ఈ ఫీచర్ భవిష్యత్తులో UPI వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇదిలా వుండగా UPI ద్వారా పన్ను చెల్లింపుల లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి లావాదేవీకి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..