Saturday, April 19Welcome to Vandebhaarath

దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ

Spread the love

న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను “నకిలీ”వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది.
ఈ విషయమై యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. “యూజీసీ (University Grants Commission ) నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య కోసం గానీ, ఉద్యోగాల్లో అవకాశాల కోసం గానీ చెల్లుబాటు కావు. ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీని అందించే అధికారం లేదు’’ అని తెలిపారు.

READ MORE  నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

ఢిల్లీలో ఎనిమిది “నకిలీ” విశ్వవిద్యాలయాలు ఉన్నాయి..

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (All India Institute of Public and Physical Health Sciences);
కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్ (Commercial University Ltd, Daryaganj)
యునైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం; వొకేషనల్ విశ్వవిద్యాలయం(United Nations University)
ADR-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ (ADR-Centric Juridical University);
ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ( Indian Institution of Science and Engineering)
విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ (Viswakarma Open University for Self- Employment) ఉన్నాయి.

READ MORE  చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

UGC ప్రకారం నకిటీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (Spiritual University)లు నాలుగు ‘నకిలీ’వి ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో
గాంధీ హిందీ విద్యాపీఠ్ (Gandhi Hindi Vidyapith)
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (National University of Electro Complex Homeopathy)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ) Netaji Subhash Chandra Bose University (Open university)
భారతీయ శిక్షా పరిషత్(Bhartiya Shiksha Parishad).

READ MORE  Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా ‘నకిలీ’ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ పేర్కొంది. విద్యార్థులు ప్రవేశాలు తీసుకునే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *