Wednesday, April 16Welcome to Vandebhaarath

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Spread the love

Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ

ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుప‌రుస్తుంది. అలాగే గూడ్స్ రైలుతో పాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు సులభతరమవుతాయి. ఫలితంగా ఈ ప్రాంతం సామాజిక-ఆర్థికావృద్ధి చెందుతుంది.ఇక కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్ట్ ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ విజయవాడ, గుంటూరు జిల్లాలు, అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. కొత్త లైన్ ప్రాజెక్ట్ సుమారు 168 గ్రామాలకు, 12 లక్షల జనాభాకు 9 కొత్త స్టేషన్లతో కనెక్టివిటీని అందిస్తుంది.ఈ రైలు మార్గాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీహార్ మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల విస్తీర్ణం సుమారు 313 కి.మీ.

READ MORE  RRB JE రిక్రూట్‌మెంట్ 2024: 7951 ఖాళీలు ప్రకటించబడ్డాయి

బీహార్ లో మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 388 గ్రామాలకు, సుమారు 9 లక్షల జనాభా గ‌ల‌ రెండు జిల్లాలకు (సీతామర్హి, ముజఫర్‌పూర్) కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రభుత్వం ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్ వంటి వస్తువుల రవాణా ఊపందుకుంటుంది. కొత్త రైల్వే లైన్ల వ‌ల్ల‌ సరుకు రవాణా సుమారు 31 MTPA (సంవత్సరానికి మిలియన్ టన్నులు) పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రైల్వేలు పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను పెంచ‌డంతోపాటు దేశం లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంలో కొత్త రైల్వే లైన్లు సహాయపడతాయి. CO2 ఉద్గారాలను (168 కోట్ల కిలోలు) తగ్గించడం, ఇది 7 కోట్ల చెట్లను నాటడానికి సమానం” అని అధికారులు చెబుతున్నారు. “కొత్త లైన్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని ‘అమరావతి’కి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. పరిశ్రమలకు స‌ర‌కుల ర‌వాణా, ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను మెరుగుపరుస్తుంది.

READ MORE  Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *