ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు.
ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని తెలిపారు. అనంతరం ఆటోపై రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించలేదు. బాధితురాలు సహాయం కోసం వీధుల్లో నడిచిన ప్రాంతాల్లో సుమారు 8 కి.మీ పరిధిలోని సిసిటివి ఫుటేజీని సేకరించారు.

READ MORE  Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం

కాగా ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో అత్యాచారానికి గురై రక్తస్రావంతో ఉన్న 12 ఏళ్ల బాలికకు బుధవారం ప్రత్యేక వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని ఒక అధికారి వార్తా సంస్థ PTIకి తెలిపారు. బాలికపై అత్యాచారానికి సంబంధించి మహకాల్ పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది సంఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఘటనపై రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీనిపై MP హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ షాకింగ్ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశామని వెల్లడించారు.

READ MORE  Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *