Sunday, March 30Welcome to Vandebhaarath

Ugadi 2025 : అనగనగా ఉగాది.. ఈ పండుగ ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలుసకోండి..

Spread the love

Ugadi 2025 : ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ (పంచాంగం) ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజును జరుపుకునే పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ చైత్ర మాసం మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2025 లో ఉగాది మార్చి 30 (ఆదివారం)న వస్తుంది.

అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దాద్రా-నాగర్ హవేలీ, డామన్- డయ్యూలలోని హిందువులు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుడి పద్వా అనే పండుగను జరుపుకుంటారు.

ఉగాది అంటే ఏమిటి?

What is Ugadi : ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. యుగాది లేదా ఉగాది అనే పదాలు ‘యుగం’ (యుగం), ‘ఆది’ (ప్రారంభం) అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి. ఇది ‘నూతన యుగం ప్రారంభం’ అని సూచిస్తుంది. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాదిగా కర్ణాటకలో యుగాది వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇది అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. ఈ రోజున రంగురంగుల మగ్గులతో వాకిళ్లను అందరంగా అలంకరిస్తారు. మామిడి ఆకులతో తలుపులను అలంకరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేయడం, పంచుకోవడం చేస్తారు. హిందూ దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు. ఆరు రుచుల మిశ్రమంతో కూడిన పచ్చడి, తెలుగు కన్నడ హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలోని అన్ని రకాల అంశాలను స్వీకరించడాన్ని సూచిస్తుంది.

READ MORE  మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి

ఉగాది చరిత్ర

Ugadi History : హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడు. తరువాత ఆయన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి, ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు.

Ugadi Fesival : ఉగాదిని ఎలా జరుపుకుంటారు?

  • ఉగాది పండగ సన్నాహాలు, హడావిడి పండుగకు ఒక వారం ముందు నుంచే ప్రారంభమవుతుంది.
  • ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం, అలంకరించడం ప్రారంభిస్తారు.
  • చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలు రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలిలోని వివిధ రంగుల వలె వారి జీవితాలు కూడా ప్రకాశవంతంగా రంగులమయంగా ఉంటుందని నమ్ముతారు.
  • ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు.
  • దేవాలయాలు, గృహాలు, దుకాణాల ప్రవేశ ద్వారాల వద్ద మామిడి ఆకులు, పూలతో తోరాణాలు కడతారు.
  • ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ ప్రారంభోత్సవాలు సర్వసాధారణం, ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు.
  • ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు, వాటిలో ఆరు విభిన్న రుచులను కలుపుకొని తయారుచేసిన పచ్చడి అనే ఒక రకమైన చట్నీ ఈ పండుగకు అత్యంత ప్రత్యేకమైనది.
  • దీనిని వేప పువ్వులు, చింతపండు, మామిడికాయ ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు కలిపి తయారు చేస్తారు. ఆరురుచులు జీవితంలోని అన్ని భావోద్వేగాలను సమానంగా స్వీకరించాలనే అర్థం ఇమిడి ఉంటుంది.
  • పచ్చడి కాకుండా, పూర్ణాలు, లేదా బొబ్బట్లు, లేదా బక్షాలు అనే వంటకాలను కూడా తయారు చేస్తారు.
  • పండుగలో మరో ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణం. పూజారులు, జ్యోతిష్కులు లేదా కుటుంబంలోని పెద్ద సభ్యులు పంచాగాన్ని చదివి వినిపిస్తారు కొత్త సంవత్సరంలో మంచి చెడు శకునాల గురించి అప్రమత్తం చేస్తారు. మామిడి ఆకులపై గోదుమ గింజలు వేస్తూ సరి, బెసి లెక్కించడం కూడా చేస్తారు.
  • ఇవి కాకుండా, రాష్ట్రాల అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
  • కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయ ఆచారాలు కూడా సాధారణం.
  • ఉగాది అంటే గతాన్ని వదిలి, జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించడం. ఆనందకరమైన పండుగ అయిన ఉగాదిని ప్రజలు శాంతి, ఆనందం శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు.
READ MORE  రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *