Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

Congress Jana Jathara  తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేశారని, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పనిచేశారో.. దిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఓ వాషింగ్ మిషన్ ఉందని, దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

READ MORE  Maha Lakshmi scheme updates | లోక్‌సభ ఎన్నికలకు ముందు 'మహాలక్ష్మి'ని అమలు చేయాలి: సీఎం

మహిళలకు ఏటా లక్ష!

తుక్కుగూడ (Congress Jana Jathara) సభ లో రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. అలాగే యువతకు ఏడాదికి రూ. లక్ష వచ్చేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు.. నెలకు రూ. 8,500 ఆర్థిక సాయం అందిస్తూ శిక్షణ ఇప్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇకపై దేశంలో కుటుంబానికి ఏటా ఆదాయం రూ. లక్ష కంటే తక్కువ ఉండదని భరోసా ఇచ్చారు రాహుల్. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ. 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని విరుచుకుపడ్డారు. రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు రాహుల్ గాంధీ విమర్శించారు.

READ MORE  కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే...

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *