TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజనం.. టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేకరులకు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగులకు రూ.10కే భోజనం
TTD Board Decisions | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమతించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మానించింది. పెద్ద సంఖ్యలో లడ్డూ తయారీకి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాపనాశనం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు రూ.3.18 కోట్లు కేటాయించాలని, 1700 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరి, గాలిగోపురం నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావిని ఆధునీకరించాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని, స్విమ్స్(SVIMS)లో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి ఉచితవైద్యం అందించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. మరోవైపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం అందించాలని నిర్ణయించింది.
మరికొన్ని కీలక నిర్ణయాలు
- గాలి గోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాలమిట్ట ప్రాంతాల్లో ఇక నిత్యం సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం.
- తాళ్లపాకలో అన్నమయ్య కళా మందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం.
- శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు పూత
- 4 కోట్ల రూపాయలతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీ.. నాలుగు కంపెనీలకు టెండర్ల కేటాయింపు.
- ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం.
- ఇకపై ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం.
- అటవీ కార్మికుల జీతాలు పెంపు..
- వడమాలపేట లోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపు.
- రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ .
- అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం..
- రూ.1.8కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేసిన శేఖర్ రెడ్డి.
- 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన.
- రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిథి గృహం ఆధునీకరణ.
- రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయాల్లో ఉన్న 682 మోటార్ పంపుల మార్పు.
- తిరుమలలోని అతిథి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు మూడేళ్ల పొడిగింపు..
- రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం.
- తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికీకరణ.
- జమ్మూలోని సిబ్బంది హెచ్‌ఆర్‌ఏ పెంపు..
- తిరుపతిలోని హరే రామ హరేకృష్ణ రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం..
- రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత పుస్తకాల ముద్రణ
- స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో కాష్ లెస్ సేవలు
- రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం..
- అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయం..
- సూపర్ వైజర్ పోస్టులతో పాటు కింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం..
- టీటీడీలోని క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..