TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు ఇవీ..
TS Mlas Assets: తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
TS Mlas Assets : తెలంగాణలోని మొత్తం 119 శాసన సభ్యుల్లో 90 శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ పేర్కొంది. బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు, అలాగే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ(BJP) ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ (ADR) సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ను బట్టి తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీలపరంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి సుమారు రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, ఇక ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి అత్యధికంగా రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లు అని సంస్థ పేర్కొంది.
టాప్ లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే
అత్యధికంగా ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రూ.161 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రూ.91 కోట్లతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆస్తుల విషయానికి వస్తే రూ.41 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.27 కోట్ల అప్పు ఉంది. సీఎం కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8కోట్ల అప్పు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆస్తుల విషయానికి వస్తే వస్తే ఆయనకు రూ.56 కోట్లు ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పు ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.
యాకుత్ పుర ఎమ్మెల్యే లీస్ట్
ఇక యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి రూ.19లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలోనే తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యే అని వెల్లడించింది. ఆయన తర్వాత ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.. రవిశంకర్ సుంకే (చొప్పదండి) కేవలం రూ.20లక్షలతో, ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) రూ.27 లక్షలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
లయబిలిటీస్ లో రూ.కోటికి పైగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో రూ.63 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రూ.40 కోట్లతో, దానం నాగేందర్ ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ సంస్థ వెల్లడించింది.