Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ షట్ డౌన్..

Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ షట్ డౌన్..

Trending News
Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్త‌ల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ కార్పొరేట్‌ వర్గాల నుంచి రాజకీయ వ‌ర్గాల వ‌ర‌కు హిండెన్ బ‌ర్గ్ నివేదిక కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ షేర్లన్నీ ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. ఈ సంస్థ రిపోర్ట్‌ భారత స్టాక్‌ మార్కెట్లను కూడా షేక్ చేసింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది.త‌మ కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ (Nathan Anderson) ప్రకటించ‌డం ఇప్పుడు సంచ‌న‌లంగా మారింది. సంస్థ మూసివేత గురించి తన సన్నిహితులతో గ‌తంలోనే చర్చించినట్లు వెల్ల‌డించారు. అనేక స‌మీక్ష‌ల తర్వాత సంస్థను ష‌...
Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Trending News
Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు.సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 24న హింసాకాండ జరిగిన రోజు సంభాల్ సహ అనూజ్ చౌదరిపై కాల్పులు జరిపినట్లు సలీంపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సలీంపై కూడా గ‌తంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై హత్యాయత్నం, దోపిడీ, గోహత్య సహా 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచ...
HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

Trending News
చైనా నుంచి విస్త‌రిస్తున్న‌ హ్యూమ‌న్ మెటాప్న్యూమో వైర‌స్ (HMPV)) మ‌న భార‌తదేశంలోనూ కల‌వ‌ర‌పెడుతోంది. కేసులు క్ర‌మేణా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు న‌మోదు కాగా, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఒక‌టి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడ‌గా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారిన‌ప‌డ్డారు.జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతుండ‌టంతో..HMPV Symptoms : జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్ల‌ల‌ను రమదాస్‌పేట్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి జ‌న‌వ‌రి 3న తీసుకెళ్లారు. అనంత‌రం ప‌రీక్షించిన వైద్యులు వీరు హెచ్ఎంపీవీ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని నిర్ధారించారు. కొవిడ్-19కి సారూప్యమైన ఈ వైరస్ పై, కింది శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్ర‌ధాన ల‌క్ష‌ణా...
Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!

Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!

Trending News
Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ త‌న వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో నివేదికలో వెల్ల‌డించింది.వార్షిక ఫుడ్ ట్రెండ్, హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేయబడతాయని ఇండియా స్విగ్గీ సూచించింది. 97.21 లక్షల ప్లేట్‌ల ఆర్డర్ల‌తో చికెన్ బిర్యానీ(Chicken biryani)కి అత్యంత డిమాండ్ ఉన్న రెసిపీగా నిలిచింది. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డ‌ర్లు వ‌చ్చాని స్విగ్గీ పేర్కొంది.ఒక హైదరాబాదీ ఆహార ప్రియుడు ఏకంగా 60 బిర్యానీలను ఆర్డర్ చేయడానికి రూ. 18,840 వెచ్చించగా, మొదటిసారి స్విగ్గీ యూజ‌ర్లు సంవత్సరంలో 4,46,000 చికెన్ బిర్యానీల(hyderabadi biryani) ను ఆర్డర్ చేయడం ద్వారా డిష్‌ను స్వీకరించారని నివేదిక పేర్కొంది. T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, హ...
CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌

CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌

Trending News
CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ "డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని" ఆరోపించారు.మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్‌ ఎన్నికల్లో ఓడిపోవ‌డానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించ‌లేద‌ని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ 'పంచతీర్థాన్ని' అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు.ఎమర్జెన్సీ సమయంలో అప్ప‌టి కాంగ్రెస్ ...
iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

Trending News
Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది.పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...
ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

Trending News
Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు.హిందువులే ల‌క్ష్యంగా…గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల‌ను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు అక్క‌డ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండ‌గులు ధ్వంసం చేశారు. ఈ దాడుల‌ను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింస‌ను ప్రేరేపించ‌డానికే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయన ...
Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Trending News
sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత ...
జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

Trending News
Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేష‌న్ల‌ (railway stations)ను ఆధునికీక‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. మ‌రోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియ‌న్‌ రైల్వే ఇప్పుడు పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల కోసం ఎక్కువ దూరం కూర్చొని సౌక‌ర్య‌వంతమైన ప్ర‌యాణం అందించే రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది.ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10 స్లీపర్ , 10 జనరల్ కోచ్‌లు10 నెలల పాటు అమృత్ భారత్ రైళ్లను ప్యాసింజర్ ఆపరేషన్లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, మరో 50 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణయించినట్లు...
Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Trending News
Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...