Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమళ్లింపు | పూర్తి వివరాలు
Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కారణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగకు ముందు 100 రైళ్లు ప్రభావితమవుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్లను దారిమళ్లించింది. మరో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది.
ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్రజలు తమ రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకోవడం ఉత్తమం. రాజ్‌నంద్‌గావ్ – నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమారు రూ.3,540 కోట్లు ఖర్చు చేస్తోంది.
రద్దయిన రైళ్ల జాబితా (Trains Cancelled)
- 08711/08712 ఆగస్టు 7-19 మధ్య డోంగర్‌ఘర్-గోండియా-డోంగర్‌ఘర్ MEMU స్పెషల్
- 08713/08716 ఆగస్టు 7-19 మధ్య గోండియా-ఇత్వారీ-గోండియా మెము స్పెషల్
- 08281/08284 ఆగస్ట్ 7-19 మధ్య ఇత్వారీ-తిరోడి-తుమ్సర్ రోడ్ MEMU స్పెషల్
- 08714/08715 ఆగస్టు 7-19 మధ్య ఇత్వారీ-బాలాఘాట్-ఇట్వారీ మెము స్పెషల్
- 18239/18240 ఆగస్టు 7-19 మధ్య కోర్బా-ఇత్వారీ-కోర్బా ఎక్స్‌ప్రెస్
- 20825/20826 ఆగస్టు 7-19 మధ్య బిలాస్‌పూర్-నాగ్‌పూర్ బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- 08756/08751 ఇత్వారీ-రామ్‌టెక్-ఇట్వారీ మెము స్పెషల్ ఆగస్టు 7 నుండి 20 వరకు రద్దు..
- 08754/08755 ఇట్వారీ- రామ్‌టెక్-ఇట్వారీ మెము స్పెషల్ ఆగస్టు 7 నుండి 20 వరకు
- 12855/12856 ఆగస్టు 7 నుండి 20 వరకు బిలాస్‌పూర్-ఇత్వారీ-బిలాస్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- 11753/11754 ఇత్వారీ-రేవా-ఇత్వారీ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 7 నుండి 20 వరకు
- 08282/08283 తిరోడి-ఇత్వారీ-తుమ్సర్ రోడ్ మెము స్పెషల్ ఆగస్టు 8 నుండి 20 వరకు
- 08267/08268 రాయ్‌పూర్-ఇత్వారీ-రాయ్‌పూర్ మెము స్పెషల్ ఆగస్టు 6 నుండి 19 వరకు
- 18109/18110 టాటానగర్-ఇత్వారీ-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 6-20 వరకు
- 11201/11202 నాగ్‌పూర్-షాడోల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 14-20 వరకు
- 12834/12833 హౌరా-అహ్మదాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 10-14 వరకు
- 12860/12859 హౌరా-ముంబై-హౌరా గీతాంజలి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5-14 వరకు
- 18237/18238 కోర్బా-అమృత్‌సర్-కోర్బా ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 4 నుండి 17 వరకు
- 18030/18029 షాలిమార్-LTT-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 11 నుండి 19 వరకు
- 12410/12409 నిజాముద్దీన్-రాయ్‌ఘర్-నిజాముద్దీన్ గోండ్వానా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 12 నుండి 19 వరకు
రైళ్ల దారిమళ్లింపు
- 12807/12808 విశాఖపట్నం-నిజాముద్దీన్-విశాఖపట్నం విజయవాడ నుంచి మళ్లించబడతాయి. ఆగస్టు 6-20 మధ్య బల్హర్షా – నాగ్‌పూర్ నుంచి నడుస్తుంది
- 20843/20844 బిలాస్‌పూర్-భగత్ కి కోఠి-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5-17 నుండి బిలాస్‌పూర్, న్యూ కట్ని మరియు ఇటార్సీ మీదుగా నడుస్తుంది
- 20845/ 20846 బిలాస్‌పూర్-బికనేర్-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 8-11 నుండి న్యూ కట్ని ఇటార్సీ మీదుగా
- 12151/12152 LTT-షాలిమార్-LTT ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 8 నుంచి 11 వరకు భుసావల్, ఇటార్సి, న్యూ కట్ని వరకు ఆగస్టు 14-17 నుండి బిలాస్‌పూర్ మీదుగా నడుస్తుంది.
- 22512/22511 కామాఖ్య-LTT-కామాఖ్య ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 3 నుండి బుర్ద్వాన్, అసన్సోల్, న్యూ కట్ని, ఇటార్సీ మీదుగా మరియు ఆగస్ట్ 10-19 నుండి భుసావల్ మీదుగా
- 20917/20918 ఇండోర్-పూరి-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ బిలాస్‌పూర్, న్యూ కట్ని మరియు ఇటార్సీ మీదుగా ఆగస్ట్ 13-15 వరకు
- 22815/22816 ఆగస్ట్ 12-14 నుండి రాయ్‌పూర్, విశాఖపట్నం మరియు విజయవాడ మీదుగా బిలాస్‌పూర్ ఎర్నాకులం-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్
- 22847/22848 విశాఖపట్నం-LTT-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ విజయవాడ, బల్లార్షా, వార్ధా భుసావల్ మీదుగా ఆగస్టు 18-20 వరకు నడుస్తుంది.
- 22620/22619 బిలాస్‌పూర్-తిరునెల్వేలి-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 11 నుండి 20 వరకు గోండియా, నాగ్‌భిడ్, బల్లార్షా మీదుగా నడుస్తుంది.
- 22648/22647 కొచ్చువేలి-కోర్బా-కొచువేలి ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 12 నుండి 14 వరకు బల్హర్షా, నాగ్‌భిడ్ మరియు గోండియా మీదుగా నడుస్తుంది.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.