Wednesday, April 23Welcome to Vandebhaarath

ఈ మహిళ నిజాయితీకి హ్యాట్సాఫ్.. రైలులో తన గొర్రె పిల్లలకు కూడా టికెట్ తీసుకుంది..

Spread the love

రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఎవరేం పట్టించుకోలరులే అనుకొని టికెట్ లేకుండానే దర్జాగా రైలెక్కుతారు.
రైలులో టీసీ (టికెట్ కలెక్టర్) వచ్చిప్పుడు చూసుకుందాంలే.. అని తేలికగా తీసుకుంటారు. ఈ విధంగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనం టికెట్ లేకుండానే తమ గమ్యస్థానాల్లో దిగి పోతుంటారు. అయితే రైళ్లలో మనుషులకే టికెట్ తీసుకోని నేటి కాలంలో రోజుల్లో.. ఓ వృద్ధురాలు.. తన పెంపుడు జంతువులకు కూడా లైలు టికెట్ తీసుకుని తన నిజాయితీని చాటుకుంది.
ఒక వృద్ధురాలు తను పెంచుకుంటున్న రెండు మేకలతో రైలు ఎక్కింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చిన ఆ మహిళను టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె టీసీకి టికెట్ చూపించింది. టికెట్ ను చూసిన టీసీ..ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
టీసీకి ఇచ్చిన టికెట్ లో ముగ్గురికి టికెట్ తీసుకున్నట్లు కనిపించగా వెంటనే టీసీ ఆమెను ప్రశ్నించాడు. ముగ్గురు ఎవరెవరని అడిగాడు. దానికి సమాధానంగా.. తనతోపాటు.. తన రెండు మేకలకు కూడా టికెట్ తీసుకున్నానని సదరు మహిళ సమాధానమిచ్చింది. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.
హ్యాట్సాఫ్..
కాగా మేక పిల్లలకు కూడా టికెట్ తీసుకున్న వృద్ధురాలిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటి వ్యక్తులు దేశానికి గర్వ కారణమంటూ ఓ నెటిజన్ కామెంట్ రాశాడు. సింపుల్ అండ్ హానెస్ట్ ఇండియన్ అని పోస్ట్ చేశాడు. అతుల్ అనే ట్విట్టర్ యూజర్ ‘మేక ఆ మహిళకు కేలవం జంతువు మాత్రమే కాదు. అది ఆమె కుటుంబంలో ఒక భాగం, ఎవరైనా కుటుంబసభ్యులతో ఇలాగనే ప్రవర్తిస్తారు.. అని కామెంట్ చేశాడు. దేశంలో ధనవంతులు దోచుకుని పారిపోతారు, పేదలు మేకలకు కూడా టిక్కెట్లు కొని నిజాయితీగా ప్రయాణం చేస్తారు’ అని మరొక నెటిజన్ రాశారు.

READ MORE  Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *