Saturday, April 19Welcome to Vandebhaarath

Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

Spread the love

Bihar train accident : బీహార్‌లో బుధవారం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (North East superfast train) పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బక్సర్ పట్ణణం సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు కొద్ది దూరంలో రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు(రైలు నంబర్ 12506 ) అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తోంది.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.

రైలు ప్రమాదంలో (Train Accident) లో గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.

READ MORE  Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రైలు ప్రమాదంలో బాధితులు, క్షతగాత్రులను రక్షించడం కోసం అలాగే, చికిత్స అందించేందుకు బీహార్ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకంుటోంది. నిమగ్నమై ఉంది.

రఘునాథ్‌పూర్‌లో రైలు ప్రమాదఘటనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) కార్యాలయం కూడా తెలిపింది. బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో తాము టచ్‌లో ఉన్నామని వారు తెలిపారు.

READ MORE  Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

హెల్ప్ లైన్ నెంబర్లు..

హెల్ప్‌లైన్ నంబర్లు — పాట్నా: 9771449971, దానాపూర్: 8905697493, కమర్షియల్ కంట్రోల్: 7759070004, అరా: 8306182542, న్యూఢిల్లీ -01123341074, 9717631960 టెర్సినల్, 9717631960 కంట్రోల్ ఢిల్లీ డివిజన్ – 9717633779.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  PF UPI Withdrawal Rules : త్వరలో UPI నుంచి EPF డబ్బును విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు.. దశల వారీ ప్రక్రియ ఇదే.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *