
Rain Report | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాతావరణ పరిస్థితులపై ఈరోజు కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు దక్షిణ భారతదేశంలోని పలు రాష్టాల్ల్రో వర్షాలు కురిసే ఛాన్స్ న్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల. వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే ప్రమాదం కూడా ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఈ వర్ష సూచనల(Rain Report ) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుపాట్ల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అవసరమైన వేళల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని, అలాగే వ్యవసాయదారులు తమ పంటలను సంరక్షించేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.