తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

TGSRTC Semi Deluxe Bus | తెలంగాణ‌ ఆర్టీసీలో కొత్తగా సెమీడీల‌క్స్‌, మెట్రో డీల‌క్స్ బ‌స్సులు రోడ్లెక్క‌నున్నాయి. పట్టణాలు, న‌గ‌రాల మధ్య సెమీ డీలక్స్‌ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డిపోల‌కు కొన్ని బస్సులు వ‌చ్చాయి. వీటిని త్వరలో వాటిని ప్రారంభించన్నారు. మహాలక్ష్మి పథకం కార‌ణంగా   ఆర్టీసీ (TGSRTC) ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం క‌ల్పించ‌డంతో ఆయా బ‌స్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగినా కూడా ఆదాయం మాత్రం భారీగా ప‌డిపోయింది. దీంతో కావాల్సిన ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునేందుకు కొత్త‌గా రెండు కేటగిరీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించ‌నుంది.

మ‌హిళ‌లూ టికెట్ తీసుకోవాల్సిందే..

ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల‌కు మ‌హిళ‌లు టికెట్ లేకుండా ఫ్రీగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. మిగ‌తా డీలక్స్, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సుల్లో టికెట్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఈ బ‌స్సులే.. అయితే వీటి టికెట్ల ధ‌రలు మిగ‌తా బ‌స్సుల కంటే ఎక్క‌వ‌గా ఉండ‌డంతో వీటికి ఆద‌ర‌ణ ఉండ‌డం లేదు. మ‌రోవైపు మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం ఉండ‌డంతో డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సులవైపు చూడడం లేదు. దీంతో సంస్థకు ఆదాయం రాడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కొత్తగా రెండు కేటగిరీ బస్సులను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

READ MORE  Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు

ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల కేటగిరీల మధ్య సెమీ డీలక్స్‌ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల వాటిల్లో టికెట్‌ ధర 5–6 శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే డీలక్స్ బస్సు కంటే 4 శాతం తక్కువగా ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సీట్ల కంటే ఇవి కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు డిమాండ్‌ ఉన్న రూట్లలో సెమీ డీలక్స్ బస్సులను నడిపించనున్నారు. బస్సుల్లో మహిళలు కిక్కిరిసిపోవడంతో పురుషులు నిలబడే ప్రయాణిస్తున్నారు. దీంతో వారిలో ఎక్కువ శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆర్టీసీ గుర్తించింది. సెమీ డీలక్స్ బస్సులు (TGSRTC Semi Deluxe Bus) అందుబాటులోకి వస్తే వారు ఈ బస్సును ఆశ్రయిస్తారని ఆర్టీసీ భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కోసం ఎక్కువ సేపు వేచి చూసే మహిళల్లో గత్యంత్రం లేక కొంతమంది ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులు ఎక్కుతారని భావిస్తోంది. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ కంటే తక్కువ స్టాపులు ఉంటాయి. వేగంగా గమ్యస్థానాలు చేరాలనుకునేవారు కూడా సెమీ డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.

READ MORE  Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

నగరాల్లో మెట్రో డీలక్స్ బస్సులు..

గతంలో నగరాల్లో పరుగులు పెట్టిన మెట్రో డీలక్స్‌ (Metro Deluxe ) కేటగిరీ బస్సులు మళ్లీ దర్శనమివ్వనున్నాయి. నగరంలో కూడా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మహిళలు కూడా తప్పనిసరిగా టికెట్‌ తీసుకోవాల్సిందే.. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోల్లో వెళ్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులను ఆశ్రయించే అవకాశం ఉంది. నగరంలో సుమారు 300 బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ భావిస్తోంది.

READ MORE  Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *