Telangana

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

Spread the love

Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు.

TGSRTC Cargo పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలు ఇవీ..!

  •  0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
  • 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60
  •  5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65
  •  10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70
  •  20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75
  •  30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *