New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?
New Ration Cards : గత వారం రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. కేవలం ఊహాగానాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలేనని నిర్ధారణ అయింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షలో రేషన్ కార్డుల గురించి ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం 6 గ్యారంటీల అమలుపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలిచ్చారు. వారం రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఎప్పుడు?
ఇలా ఉండగా, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా మంజూరు చేస్తుందని ఆశిం...