Telangana

TGSRTC ticket booking | మీ సేవ’ మొబైల్ యాప్‌లో TGSRTC బస్ టిక్కెట్లు: ప్రయాణికులకు డిజిటల్ సౌకర్యాల విస్తరణ

Spread the love

TGSRTC ticket booking | తెలంగాణ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను అందించేందుకు Telangana State Road Transport Corporation (TGSRTC) కీలక ముందడుగు వేసింది. ఇకపై ప్రయాణికులు ‘మీ సేవ – మీ టికెట్’ మొబైల్ యాప్ ద్వారా నేరుగా బస్ టిక్కెట్లు, బస్ పాస్‌లు, T-24 ట్రావెల్ పాస్‌లను డిజిటల్‌గా పొందే అవకాశం కల్పించింది.

ఈ మొబైల్ యాప్‌ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, TGSRTC వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

OPRS సేవలు – 1,710 బస్ సర్వీసులు

ఈ యాప్ ద్వారా TGSRTC Online Passenger Reservation System (OPRS) సేవలను అనుసంధానం చేశారు.

  • మొత్తం సేవలు: 1,710
  • A/C బస్సులు: 450
  • నాన్-A/C బస్సులు: 1,260
  • రోజువారీ బుకింగ్ సీట్లు: 13,000

ప్రధాన గమ్యస్థానాలు:

  • బెంగళూరు
  • తిరుపతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • ఖమ్మం
  • వరంగల్
  • ఆదిలాబాద్

హైదరాబాద్‌లో 5 రకాల సిటీ బస్ పాస్‌లు

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఇప్పుడు నెలవారీ బస్ పాస్‌లు మొబైల్ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.

  • పాస్ రకం ధర
    సిటీ ఆర్డినరీ ₹1,400
  • మెట్రో ఎక్స్‌ప్రెస్ ₹1,600
  • మెట్రో డీలక్స్ ₹1,800
  • గ్రీన్ మెట్రో లగ్జరీ A/C ₹2,200
  • పుష్పక్ A/C ₹5,000
  • T-24 టికెట్ – 24 గంటల అపరిమిత ప్రయాణం
  • T-24 డిజిటల్ ట్రావెల్ పాస్‌ను కూడా యాప్‌లో విలీనం చేశారు.

ప్రయోజనాలు: 24 గంటల అపరిమిత ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో చెల్లుబాటు అవుతుంది. ధరలు ఇలా ఉన్నాయి. పెద్దలు: ₹130, పిల్లలు: ₹90, మహిళలు (ఇతర రాష్ట్రాలు), సీనియర్ సిటిజన్: ₹110. రోజుకు సగటున 16,830 టిక్కెట్లు విక్రయమవుతున్నాయి.

డిజిటల్ తెలంగాణ దిశగా కీలక అడుగు

ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. బస్ పాస్‌లు డిజిటల్‌గా పొందవచ్చు. క్యూలలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *