Wednesday, March 12Thank you for visiting

Ration Card Updates | రేష‌న్ కార్డుల ద‌ర‌ఖాస్తుల‌పై స‌ర్కారు కీలక అప్ డేట్‌

Spread the love

Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఆయా సెంటర్లు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశాల మేరకు తాము ఎలాంటి తుది గడువు విధించలేదని.. కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులెవరూ ఇబ్బందులు పడొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

భారీగా దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రజాపాలన, కులగణన (Caste Census ) సర్వే సహా జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రజావాణి. మండల కేంద్రాలు, పురపాలక సంఘాలు, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయొద్దని పౌరసరఫరాల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తుల కోసం రావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే చాలా మీ – సేవా కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది.

READ MORE  Hyderabad Metro Phase II | హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కారిడార్ల వారీగా డీపీఆర్‌లు సిద్ధం

Ration Card Updates : దరఖాస్తుదారులు.. ఆందోళన వద్దు

అలాగే మీ-సేవా కేంద్రాలకు కూడా ఒక్కసారి కాకుండా.. నిదానంగా సమయం తీసుకుని దరఖాస్తులు సమర్పించాలని ఆ దరఖాస్తులు ఎంట్రీ తర్వాత మీ-సేవ కేంద్రాల్లో ఇచ్చే స్లిప్​ లు దరఖాస్తులు భద్రపరుచుకోవాలని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆ ఎంట్రీ రసీదు పౌరసరఫరాల శాఖ లేదా చౌక ధరల దుకాణాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. దరఖాస్తుదారులెవరూ కూడా రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసింది.

READ MORE  Praja Palana Application Status : ప్రజాపాలన దరఖాస్తులపై 'స్టేటస్ చెక్' ఆప్షన్ వచ్చేసింది... ఒక్కసారి చెక్ చేసుకోండి..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ? Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు