Telangana Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!
Telangana Rain Alert | తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వర్షాలు వానలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఇక మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం /ఉందని వెల్లడించింది. అలాగే బుధవారం నుంచి గురువారం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఆసిఫాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వానలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👏👏👏👏