
Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana BJP ) అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం ఒక స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరును ఫైనల్ చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ సమర్పించనున్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రమచందర్‌రావు వైపే మొగ్గుచూపింది.
రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్లను స్వీకరించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఉంటుంది. జూలై 1వ తేదీన కొత్త అధ్యక్ష ప్రకటన ఉంటుంది.
అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.