పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి.
ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. .
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది.
” గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దోషుల నుంచి వసూలు చేసిన రూ.8 లక్షల జరిమానా మొత్తాన్ని కూడా బాధితురాలికి అందించాలని పేర్కొంది.
బెంగాల్‌లో అతిపెద్ద పండుగ అయిన దుర్గా పూజ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఈ శిక్ష విధించబడింది. ఈ నేరం కూడా 2021లో ఇదే పండుగకు రెండు రోజుల ముందు జరిగడం గమనార్హం.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిభాస్ ఛటర్జీ మాట్లాడుతూ.. “ఈ కేసులో అత్యంత కీలకమైంది.. దోషులకు వ్యతిరేకంగా లభించిన డిజిటల్ సాక్ష్యమే.. బాలికపై ఘాతుకానికి పాల్పడినపుడు నిందితులు వీడియో తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తామని బాలికను బెదిరించారు. అమ్మాయి భయంతో ఎవరికీ చెప్పండా మౌనంగా ఉన్నప్పటికీ వారు వీడియోను వీడియోను అందరికీ షేర్ చేశారు.”అని ఛటర్జీ చెప్పారు.
“వీడియో కాపీలను పూణే, అస్సాం, కోల్‌కతాలోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు పంపారు. వీడియోను పరిశీలిస్తే ఇద్దరు రేపిస్టులు తమ చేతులపై టాటూ(tattoos)లు వేయించుకున్నట్లు తేలింది. వీడియోలో కనిపించిన టాటూలు నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారిపై కనిపించిన వాటితో సరిపోలాయి. వీడియో నుండి సేకరించిన వాయిస్ నమూనాలు కూడా సరిపోలాయి. ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఎంత కీలకమైనదో ఈ కేసు నిదర్శనంగా నిలిచింది. అని ఛటర్జీ వెల్లడించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
లుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.