Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై… ఇక లోక్ సభ బరిలోకి సై..

Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై… ఇక లోక్ సభ బరిలోకి సై..

Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళిసైకి కిషన్‌ రెడ్డి కాషాయ‌ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ మాజీ గవర్నర్ కూడా పుదుచ్చేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “నేను ఇక్కడ పనిచేసిన సమయంలో పుదుచ్చేరి ప్రజలు చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను,” కేంద్ర పాలిత ప్రాంతంలోని చాలా మంది పేదలు, విద్యార్థులు మరియు ఇతరులను మెరుగుపరచడానికి ఆమె ఉపయోగించకుండా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అని అన్నారు.

READ MORE  Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?

కాగా, త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ (Tamilisai Soundararajan ) సుమారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. ఆమె 2007 నుండి 2010 వరకు తమిళనాడు బిజెపికి అధికార ప్రతినిధిగా పనిచేశారు.  2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓట‌మిపాలయ్యారు. ఈ క్ర‌మంలో కేంద్రం ఆమెను తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలపై మ‌క్కువ ఉన్న ఆమె.. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్న‌ట్లు త‌మిళిసై వెల్లడించారు. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *