Bastar dussehra : ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన 75 రోజుల దసరా వేడుకలు ఎక్కడో తెలుసా..
Bastar dussehra : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రత్యేకమైన దసరా వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి, 600 ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి గిరిజన ప్రజలు 'కచ్చిన్' దేవతకు ఆరాధిస్తారు. బస్తర్‌లోని 'రాజ్ పరివార్' కమిటీ ఈ ఉత్సవాలను ప్రారంభించింది.
ప్రధాన కార్యక్రమం జగదల్పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పట్టణం మొత్తం విస్తృతమైన అలంకరణలతో ముస్తాబైంది.
75 రోజుల వేడుకలు
Bastar dussehra వేడుకల విశిష్టత ఏమింటే.. బస్తర్‌లోని దసరా పండుగ సాధారణంగా 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన దసరా వేడుకగా నిలిచింది. బస్తర్‌లోని ఈ 75 రోజుల వేడుక విలక్షణమైన ఆచారాలను ప్రతిరోజూ పాటిస్తారు. దసరా (విజయదశమి) సందర్భంగా దేశమంతటా 'రావణుని' దిష్టిబొమ్మలను దహనం చేస్తే.. ఇక్కడ అలాంటి ఆచారం ఉండదు. ఈ పట్టణంలో 'మహిషాసుర మర్దిని ఆదిశక్తికి'గా కొలుస్తారు. దసరా వేడుకల్లో జిల్లాలోని గి...