Sunday, August 31Thank you for visiting

Tag: Warangal local news

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

Local
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపువరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...
భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

Local
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభంవరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి...