Friday, April 18Welcome to Vandebhaarath

Tag: Vandebhaarath news

Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?
National

Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?

Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ముఖ్య‌మంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిలిచారు. ఎక్స్ (ట్విట‌ర్‌) ఖాతాలో దేశ‌వ్యాప్తంగా మిగ‌తా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక వీరిద్ద‌రి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు.భారత్ లో మోస్ట్‌ పాపులర్‌ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘ‌న‌తికెక్కారు. భారత్‌లో మిగ‌తా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను క‌లిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వా...
Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..
National

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..

స్వామివారి దర్శన సమయాలను పొడింగించిన ఆలయ ట్రస్టు Ayodhya Ram Mandir | అయోధ్యలో నూతనంగా ప్రారంభించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తుల కు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) సమర్పించుకున్నారు.సాధారణ భక్తులకు అనుమతించిన తొలి రోజే రామ మందిరానికి రూ.3 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లతోపాటు, ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా వెల్లడించారు.మరోవైపు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్...
Article 370  | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
National, Trending News

Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Article 370 | జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.కాగా ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం...
ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..
Special Stories

ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..

మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది.వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ..అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది.ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది.సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD కేవలం కాఫీ షాప్ కంటే ఎక్కువ.. ఇది ప్రజలు క...
భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం
National

భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం

వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత  రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు.ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందా...