హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి
ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి."వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది... 2024 ప్రారంభంలో వస్తుంది’’ మంత్రి (Railway Minister, Ashwini Vaishnaw) కూలో రాశారు.
వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, అధునాతన భద్రతా ఫీచర్లతో సహా అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని భావిస్...