Vande Bharat | ప్రయాణీకులకు శుభవార్త: భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు 2 నెలల్లో ట్రాక్‌లోకి..
Vande Bharat Sleeper Trains | ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే.. తన ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే త్వరలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు రెడీ అయ్యాయి. రెండు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి అన్ని సాంకేతిక పనులు తుది దశలో ఉన్నాయని, ఈ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన వసతులను అందజేస్తాయని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ పూర్తి చేసే పని శరవేగంగా జరుగుతుంది. మొదటి రైలు రెండు నెలల్లో ట్రాక్ పైకి వస్తుంది. సాంకేతిక పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. రైలు సెట్‌ను బెంగుళూరులోని దాని రైలు యూనిట్‌లో BEML లిమిటెడ్ తయారు చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎ...