
vande bharat sleeper coach | వందేభారత్ స్లీపర్ రైలు అబ్బురపరిచే అత్యాధునిక ఫీచర్లు..
vande bharat sleeper coach | భారత్ లో వందేభారత్ రైళ్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. అత్యాధునిక సౌకర్యాలు, అత్యధిక వేగం గల ఈ రైళ్లు దాదాపు వందశాతం ఆక్యుపెన్సీతో పరుగులు పెడతున్నాయి. ప్రయాణకుల నుంచి వస్తున్న డిమాండ్ తో భారతీయ రైల్వే వందేభారత్ రైళ్లలో అనేక మార్పులను తీసుకొస్తున్నది. త్వరలో వందే మెట్రో రైళ్లతోపాటు వందేభారత్ స్లీపర్ వెర్షన్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. స్లీపర్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికులు అమితంగా ఎదురుచూస్తున్న తరుణంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు శరవేగంగా ముందుకు సాగుతోంది.తాజాగా వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థ కు రైల్వే శాఖ ఇచ్చింది. ఐటల్ సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల సూచనలమేరకు రైల్వే శ...