Saturday, February 28

Tag: Vande Bharat Express

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Telangana
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.కాగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు..కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరు...
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

National
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.ముంబై - గోవా వందే భారత్ (Mumbai - Goa Vande Bharat)గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది.దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే ఏడు స్టేషన్లలో ఇది హాల్టిం...
Vande Bharat Express : సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు సమయాల్లో మార్పులు

Vande Bharat Express : సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు సమయాల్లో మార్పులు

Telangana
 Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. మే 17 నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 20701 నెంబర్‌తో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్.. ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి.. తిరుపతి స్టేషన్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే వచ్చే ట్రైన్ 20702 నెంబర్‌తో తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కాస్తా.. 8.15 గంటలకు తగ్గనుంది.సికింద్రాబాద్-తిరుపతి(20701): సికింద్రాబాద్ – ఉదయం 6.15 గంటలకు నల్గొండ – ఉదయం 7.29 గంటలకు గుంటూరు – ఉదయం 9.35 గంటలకు ఒంగోలు – ఉదయం 11.12 గంటలకు నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు తిరుపతి – మధ్యాహ్నం 2.30 గంటలకుతిరుపతి – సికింద్రాబాద్(20702): తిరుపతి – మధ్యాహ్...