Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...