
UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత
ఉత్తరాఖండ్‌లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్రUttharaKhand : ఉత్తరాఖండ్‌లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. మతమార్పిడి అయినా, లవ్ జిహా ద్ అయినా, ల్యాండ్ జిహాద్ అయినా, స్పిట్ జిహాద్ అయినా లేదా ఇటీవల చర్చకు దారితీస్తున్న మదర్సా జిహాద్ అయినా, పుష్కర్ దామీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన, నిర్ణయాత్మక చర్య తీసుకుంటోంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తాజాగా స్పష్టం చేసింది.ఈ క్రమంలో, ప్రభుత్వం ఇప్పుడు చట్టవిరుద్ధంగా, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న మదర్సాలపై యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 170 కి పైగా మదర్సాలను సీల్ చేశారు, అవి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయన...