Police Action | పోలీసుల ఎన్కౌంటర్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మృతి
Police Action in UP| ఉత్తరప్రదేశ్‌లోని భోగి మజ్రా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ (Encounter)లో మీరట్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కాగా మృతుడి తలపై ₹1 లక్ష రివార్డ్ ఉంది.నిందితుడు ఫైసల్ హత్య, దోపిడీ సహా 17 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. "ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు, ఫైసల్, అతని సహచరుడు బర్నావి గ్రామానికి చెందిన జీత్రమ్, అతని భార్య నుంచి వారి మోటార్ సైకిల్, ₹3,000 నగదు, మొబైల్ ఫోన్‌ను దోచుకున్నారు" అని పోలీసు సూపరింటెండెంట్ (SP) నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భోగి మజ్రా-మచ్రోలి రోడ్డులోని భోగి మజ్రా సమీపంలో జింఝానా పోలీసు బృందం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)తో కలిసి ఫైసల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగింది."అతను పోలీసులపై కాల్పులు జరిపాడు, ప్రతీకారం త...







