
Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకం విధించిన రోజున, మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది."నిజమైన స్వదేశీ అంటే బలవంతం కాదు, ప్రపంచంతో స్వచ్ఛంద సహకారం. అవసరమైతే మాత్రమే దిగుమతులు చేసుకోవాలి. మిగతా అవసరాలను దేశీయ ఉత్పత్తుల (Swadeshi products) ద్వారానే తీర్చుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉపన్యాసంలో భగవత్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక విధానాలు బలవంతం కాకుండా సహకారంపై ఆధారపడాలని సూచించారు. "లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైందీ, ఐక్యరాజ్యసమితి కూడా సంఘర్షణలను నివారించడంలో తడబడుతోంది. నేటి ప్రపంచం అసహనం, మతోన్మాదం, ‘వోకిజం’ (Woke ideology) వంటి భావజాలాల వల్ల కల్ల...