Festive Season | టికెట్ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే
Festive Season | రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝలక్ ఇవ్వనుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృతస్థాయిలో మోహరించనుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.పండుగ రద్దీ నేపథ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా తనిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున...