Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..
Union Budget 2024 | కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్లడిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్షన్ గురించి కూడా వివరాలను పంచుకున్నారు.
రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే...