Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా ఉత్తరఖండ్..
Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవలే విస్తృత చర్చలను నిర్వహించింది. అనంతరం కమిటీ తన సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ 9 నాటికి రాష్ట్ర 24వ ఆవిర్భావ దినోత్సవంతో యుసిసిని అమలు చేయనున్నట్లు గతలోనే ప్రకటించారు.ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో యూసీసీ (Uniform Civil Code) బిల్లును ఆమోదించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు, UCCని అమలులోకి తెచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి మార్గం సుగమం చేసింది.ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ ...