Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: TS News

TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు
Local

TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు

హైద‌రాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచింది. గ్రేట‌ర్ శివారు ప్రాంతాల నుంచి ప్ర‌తి రోజు లక్షలాది మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన బ‌స్సు సౌక‌ర్యం లేకపోవ‌డంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీజీ ఆర్టీసీ ఫోక‌స్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్త‌గా సర్వీసులను ప్రారంభించనుంది.టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మా...
Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల
Telangana

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష...
CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...